IND VS SA : వరుణుడి దెబ్బకు రెండో రోజు ఆట హుష్ ?

Rain delays second day ind vs sa test match

IND VS SA : సెంచూరియన్‌ లో ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం మొదలైన తోలి టెస్ట్ మ్యాచ్ కు సోమావారం నాడు వర్షం అంతరాయాన్ని కలిగించింది. రెండవ రోజు వరుణుడి దెబ్బకు ఒక్క బంతి కూడా ఆడకుండానే ఆటగాళ్లు లంచ్ కి వెళ్లారు. వాన దేవుడు వస్తూ పోతూ దోబూచులాటలు ఆడుతున్నాడు. లంచ్ తర్వాత అంపైర్లు మైదానాన్ని పరిశీలించి తదుపరి నిరణయాన్ని తీసుకుందామనుకున్నారు. కానీ వర్షం మరలా పడటంతో ఇక ఆటని కొనసాగించటం కష్టమని అంటున్నారు. రెండో రోజు ఆట పూర్తిగా రద్దయిపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు KL రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని అందించారు. 60 పరుగులు చేసిన మయాంక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బాటింగ్ కి వచ్చిన పుజారా ఫస్ట్ బాల్ కే ఔట్ అవ్వటంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కొంతసేపు విరాట్ తన అద్భుతమైన బాటింగ్ తో చెలరేగాడు. కానీ 35 పరుగులకే విరాట్ వెనుదిరిగగా అజింక్యా రహానేతో కలిసి రాహుల్ తన సెంచరీ పూర్తి చేసుకుని తన క్లాస్ ఇన్నింగ్స్ తో అభిమానుల్ని అలరించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోర్ 272/3. భారత్ మూడు వికెట్లు దక్షిణాఫ్రికా బౌలర్ ఎంగిడినే తీయడం విశేషం.