Shikhar Dhawan is adjudged Man of the Match for his brilliant knock of 106*.#Dream11IPL pic.twitter.com/IMsogwSmst
— IndianPremierLeague (@IPL) October 20, 2020
DC vs KXIP, దుబాయ్ : సీజన్‌లో బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలిన ఉండగానే పంజాబ్ టీమ్ 167/5తో ఛేదించేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12×4, 3×6) సెంచరీ బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. ఛేదనలో నికోలస్ పూరన్ (53: 28 బంతుల్లో 6×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌కి క్రిస్‌గేల్ (29: 13 బంతుల్లో 3×4, 2×6), గ్లెన్ మాక్స్‌వెల్ (32: 24 బంతుల్లో 3×4) హిట్టింగ్ తోడవడంతో పంజాబ్ టీమ్ 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో పదో మ్యాచ్ ఆడిన పంజాబ్‌కి ఇది నాలుగో విజయంకాగా.. ఢిల్లీకి ఇది మూడో ఓటమి.
ఛేదనలో పంజాబ్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (15: 11 బంతుల్లో 1×4, 1×6) ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఔటవగా.. అనంతరం వచ్చిన క్రిస్‌గేల్ (29: 13 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు ఒక ఓవర్‌కే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నికోలస్ పూరన్‌తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5 9 బంతుల్లో) రనౌటయ్యాడు. దాంతో.. 5.5 ఓవర్లు ముగిసే సమయానికి 56/3తో పంజాబ్ నిలిచింది. కానీ.. ఈ దశలో మాక్స్‌వెల్‌తో కలిసి దూకుడుగా ఆడిన నికోలస్ పూరన్ ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలో మాక్స్‌వెల్‌తో కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన పూరన్.. జట్టు స్కోరు 125 వద్ద ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వచ్చేయగా.. ఆ తర్వాత మాక్స్‌వెల్ జోరందుకున్నాడు. చివర్లో దీపక్ హుడా (15: 22 బంతుల్లో 1×4), జేమ్స్ నీషమ్ (10 నాటౌట్: 8 బంతుల్లో 1×6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.