ఐపీఎల్ 2021 : శ్రీశాంత్‌ కి నిరాశే ..జాభితాలో ‘అర్జున్’ !

ఐపీఎల్‌–2021 (ఇండియన్ ప్రీమియర్ లీగ్ ) వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 18న చెన్నైలో జరిగే వేలంలో మొత్తం 292 క్రికెటర్లు అందుబాటులోకి వస్తారు. ఐపీఎల్‌ వేలంలో పాల్గొనేందుకు 1114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ జాబితాలో శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు.

అయితే , బీసీసీఐ ప్రకటించిన జాబితాలో సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కు జాబితాలో ఉన్నాడు.‌‌ వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ, సన్‌రైజర్స్‌ జట్టులో 3 స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది.

కనీస రూ.2 కోట్ల జాబితాలో భారత్‌ నుంచి హర్భజన్‌, కేదార్‌ జాదవ్‌, విదేశాల నుంచి.. స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు. మరో వైపు బోర్డు ప్రకటనలో ‘వివో’ ఐపీఎల్‌–2021 అని ప్రముఖంగా ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది లీగ్‌కు మళ్లీ చైనా మొబైల్‌ కంపెనీ ‘వివో’నే స్పాన్సర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.