దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 13లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా, తాజాగా సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాలు పట్టేయడంతో ఈ మెగా టోర్నీకి పూర్తిగా దూరమాయ్యాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్రకటించింది. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ 13కు భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడని, అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా భువీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారో విషయాన్ని కూడా పేర్కొంది.
గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ప్రాతినిథ్యం వహించిన పృథ్వీరాజ్ యర్రా ఈ సీజన్‌లో భువీ స్థానంలో ఆడతాడని తెలిపింది. ఈ ప్రథ్వీరాజ్ ఎవరో కాదు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఆటగాడే. గత సీజన్‌లో కేకేఆర్ తరుపున ఆడిన అతడు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ను ఔట్ చేశాడు. ఇక ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. 2019 సీజన్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్.. పృథ్వీ రాజ్ యర్రాను వదులుకుంది. కానీ దురదృష్టవశాత్తు భువీ ఈ సీజన్‌కు దూరమవ్వడంతో పృథ్వీకి లక్కీగా అవకాశం దక్కింది. 2017లో దేశవాళీ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్, 9 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్ ఆడిన పృథ్వీ 54 వికెట్లు పడగొట్టాడు.