న్యూజిలాండ్ పై రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత్

న్యూజిలాండ్ తో మౌంట్ మాంగనూయ్ లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 91 పరుగుల తేడాతో భారత్ గెలిచి 5 వన్డేల సిరీస్ లో 2-0 తేడాతో ఆధీక్యంలో ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 324 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 91 పరుగుల తేడాతో 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

భారత బౌలర్ల దెబ్బకు కివీస్ బ్యాట్స్ మెన్స్ కుదేలయ్యారు.  కుల్డీప్ కు నాలుగు వికెట్లు, చాపల్, భువనేశ్వర్ లకు చెరో రెండు వికెట్లు పడ్డాయి. భారత బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ 87, శిఖర్ ధావన్ 66, కోహ్లీ 43, రాయుడు 47, ధోని 48, జాదవ్ 22 పరుగుల చేశారు. కివీస్ బ్యాట్స్ మెన్స్ మార్టిన్‌ గప్టిల్‌(15), విలియమ్సన్‌(20), మున్రో(31), రాస్‌ టేలర్‌(22), టామ్‌ లాధమ్‌(34), గ్రాండ్‌ హోమ్‌(3), హెన‍్రీ నికోలస్‌(28), ఇష్‌ సోధీ(0)లు వరుసగా క‍్యూకట్టడంతో కివీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. బ్రాస్‌వెల్‌(57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ కివీస్‌ను గెలిపించలేకపోయాడు.