న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగన ఇండియా 252 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ తర్వాత 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 44.1 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటయ్యింది. 35 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. వెల్లింగ్టన్ వేదికగా ఐదో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో భారత్ 4-1 తో ముందంజలో ఉంది. ఇప్పటికే సిరీస్ భారత్ వశమైంది.
న్యూజిలాండ్ బ్యాట్ మెన్స్ మున్రో 24, నికోల్స్ 8, విలియమ్ సన్ 39, టేలర్ 1, లాథమ్ 37, నీషామ్ 44, గ్రాండ్ హోమ్ 11, సాట్నర్ 22, ఆస్టిల్ 10, పరుగుల చేశారు. భారత బౌలర్లు చాహల్ 3, షమీ 2, పాండ్యా 2 వికెట్లు తీశారు.
భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్లలో అంబటి రాయుడు 90, శంకర్, 45, జాదవ్ 34, పాండ్యా 45, శర్మ 2, ధావన్ 6, గిల్ 7, ధోని 1, కుమార్ 6, షమీ 1 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు హెన్రీ 4, బౌల్ట్ 3, నీషమ్ 1 వికెట్ తీశారు.
కివీస్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. న్యూజిలాండ్ కూడా భారత్ ను ఇరుకున పెట్టింది. అయినా మ్యాచ్ లో గెలవలేకపోయింది. నాలుగో వన్డేలో చతురత చూపించి న్యూజిలాండ్ గెలవగలిగింది. కానీ ఐదో వన్డేలో అదే పటిమను ప్రదర్శించినా భారత్ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది.ఐదు వన్డేల సిరీస్ ను 4-1 తో గెలుచుకోవడంతో భారత్ దూకుడు మీద ఉంది.
ఈ గెలుపుతో 4-1తో సిరీస్ నెగ్గి 52 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. 1967 నుంచి కివీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో సిరీస్ విజయాన్ని 2008-09 పర్యటనలో అందుకుంది. తాజాగా 4-1తో సిరీస్ గెలుపుతో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో సమిష్టిగా రాణించి విజయాన్నందుకున్న రోహిత్ సేన నాలుగో వన్డే పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.