భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డేలో భారత్ గెలిచింది. 4 వికెట్లు నష్టపోయిన భారత్ 240 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో ఉంది.
జాదవ్ 81, ధోని 59, కోహ్లీ 44, రోహిత్ 37 పరుగులు చేసి భారత్‌కు విజయం అందించారు. ఆస్ట్రేలియా బౌలర్లు కౌల్టర్ నైల్, జంపా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు ఉస్మాన్ ఖవాజా 50, మ్యాక్స్‌వెల్ 40, స్టోయినిస్ 37, కారే 36 పరుగులు చేశారు. భారత బౌలర్లు షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు, జాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు.
తొలి వన్డేలో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 236 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాట్ మెన్స్ ఫించ్ 0, ఖవాజా 50, హ్యండ్స్ కోంట్ 19, మ్యాక్స్ వెల్ 40, టర్నర్ 21, నైల్ 28, క్యారీ 36, కమిన్స్ 0 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు తలా రెండు వికెట్లు తీశారు. జాదవ్ ఒక వికెట్ తీశారు.