విశాఖ T-20 లో ఆసీస్ చేతిలో భారత్ ఘోర పరాజయం

విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ట్వంటి ట్వంటీ మ్యాచ్ లో టిమిండియా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బరిలోకి దిగిన భారత్ 126 పరుగులకు పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 5, కోహ్లి 24, రిషబ్ పంత్ 3, రాహుల్ 50, దినేష్ కార్తీక్ 1, ధోని 29, ఉమేష్ యాదవ్, పాండ్యా ఒక్కో పరుగు చేశారు. దీంతో భారత్ 126 పరుగులు చేసింది. భారత బ్యాట్ మెన్స్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడడంతో తక్కువ స్కోరుతోనే భారత్ ఆట ముగించింది. 

ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 127 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఆసీస్ బ్యాట్ మెన్స్ షార్ట్ 37, స్టోనీస్1, ఫించ్ 0, మ్యాక్స్ వెల్ 56, హ్యాండ్స్ కోంబ్ 13, టర్నర్ 0, కాల్టర్ 4, క్యుమిన్స్ 1, రిచర్డ్ సన్ 7 పరుగుల చేశారు. భారత బౌలర్లు బుమ్రా 3, చాహెల్ 1, పాండ్యా1 వికెట్లు తీశారు.

బుమ్రా చాలా చక్కని బౌలింగ్ తో ఆసీస్ బ్యాట్ మెన్స్ కు దడ పుట్టించాడు. దీంతో ఆసీస్ బ్యాట్ మెన్స్ ముందుగా చేతులేత్తేశారు. కానీ అనూహ్యంగా పరుగులు సాధిస్తూ ఆసీస్ ను విజయతీరం చేర్చారు. ఒకానొక దశళో మ్యాచ్ పూర్తిగా భారత్ కు అనుకూలంగా ఉంది. కానీ చివరి ఓవర్లో ఉమేష్ యాదవ్ 13 పరుగులు ఇవ్వడంతో భారత్ ఘోర పరాజయం పాలైంది. దీంతో అభిమానులంతా నిరాశ చెందారు. మూడు t20ల సిరీస్ లో ఆసీస్ 1-0 తో ఆధిక్యంలో ఉంది.