ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టిమిండియా భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్ మన్ ఆసీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. నాలుగో టెస్ట్ లో రెండో రోజే 622 పరుగుల భారీ స్కోర్ సాధించి భారత్ డిక్లేర్ చేసింది.
303/4 పరుగుల వద్ద భారత్ రెండో రోజు ఆట ప్రారంభించింది. రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిపోయారు. రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ చేశారు. చతేశ్వర్ పుజారా 193 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఏడు పరుగుల తేడాతో పుజారా డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ హానుమ విహారి కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. పుజారా, పంత్ కలిసి ఆరో వికెట్ కు 89 పరుగులు జోడించారు.
ఆఖర్లో పంత్, జడేజా చెలరేగి ఆడడంతో టిమిండియా 600 స్కోరు దాటింది. వీరిద్దరు ఏడో వికెట్ కు 204 పరుగులు జోడించారు. సెంచరీ చేసే దిశగా సాగుతున్న జడేజాను లయన్ అవుట్ చేశాడు. దీంతో కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు. జడేజా 81 పరుగులు చేశాడు. పంత్ 189 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ తో 159 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఆసీస్ బౌలర్లలో లయన్ కు 4, ,హాజిల్ వుడ్ లు 2 వికెట్లు, స్టార్క్ 1 వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.