ఐదో వన్డేలో 252 పరుగులకు భారత్ ఆలౌట్

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ 252 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో న్యూజిలాండ్ విజయలక్ష్యం 253 పరుగులుగా నిర్దేశింపబడింది. భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్లలో అంబటి రాయుడు 90, శంకర్, 45, జాదవ్ 34, పాండ్యా 45, శర్మ 2, ధావన్ 6, గిల్ 7, ధోని 1, కుమార్ 6, షమీ 1 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు హెన్రీ 4, బౌల్ట్ 3, నీషమ్ 1 వికెట్ తీశారు. ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో సిరస్ 3-1 గా ఉంది.  నాలుగో వన్డేలో చతికిలపడ్డ భారత్ ఐదో వన్డేలో తన పటిమ చాటింది. వెల్లింగ్టన్ వేదికగా ఐదో వన్డే జరుగుతోంది. 

అంబటి రాయుడు వన్డేల్లో మరో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో 90 పరుగుల దగ్గర ఓ భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. అతడు ఔటైన తర్వాత పాండ్యా మెరుపులు మెరిపించాడు. సిక్సర్లతో కివీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆస్టల్ వేసిన ఓ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. దీంతో ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అనుకున్న టీమ్ కాస్తా.. మంచి లక్ష్యాన్ని కివీస్‌కు విధించింది.