భారత్ యువ స్ప్రింటర్ హిమ దాస్ చరిత్ర సృష్టించింది. ఈ అసోం అమ్మాయి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ లో స్వర్ణం కొల్లగొట్టింది.ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరుగుతున్న ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ -20 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో మహిళల 400 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది.18 ఏళ్ళు హిమ ఫైనల్ రేసును 51.46 సెకన్లలో ముగించి బంగారు పతకం అందుకుంది.ప్రపంచ అథ్లెటిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన హిమ దాస్.. ఓవరాల్‌గా ఈ టోర్నీలో స్వర్ణం అందుకున్న తొలి భారత మహిళగానూ రికార్డు సృష్టించింది.
Watch: #HimaDas‘s historic gold medal-winning effort at the #IAAFWorlds in Tampere. The first Indian to win a track event at the global stage, at any age category!
(Video: @iaaforg)pic.twitter.com/fM8HswtZX6
— The Field (@thefield_in) July 13, 2018