దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజలో ఈ వస్తువుల తప్పనిసరిగా?

దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి అమావాస్య రోజున లక్ష్మి, గణపతి, కుబేరుడిని పూజించటం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి నాడు ఇంటింటా దీపాలు వెలిగించి పండగను జరుపుకుంటారు. ఇలా చీకటి నుండి వెలుగులోకి పయనించడం ద్వారా అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించడానికి ఇది ప్రతీకగా భావిస్తారు. దీపావళి అమావాస్య రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.అయితే లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆ పూజలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉంచాలి.

• దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించే సమయంలో లక్ష్మీదేవి పాదాలను ఉంచి పూజించాలి. వెండి బంగారం ఇత్తడితో చేసిన అమ్మవారి పాదాలు పూజలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. స్తోమత లేని వారు అమ్మవారి పాదాలను కాగితం మీద గీసి పూజలో ఉంచి పూజించడం వల్ల కూడా ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు.

• దీపావళి పండుగ రోజున చేసే లక్ష్మీ పూజలో శ్రీ యంత్రం తప్పనిసరిగా ఉంచాలి. శ్రీయంత్రం లేకుండా లక్ష్మీ పూజ చేయడంతో పూజ అసంపూర్ణంగానే ఉంటుంది.

• పరిశుభ్రతను ఇష్టపడే లక్ష్మీదేవి దీపావళి రోజున ఇంట్లోకి ప్రవేశించాలంటే ఇంటి ముఖద్వారం ముందు చక్కగా రంగురంగుల ముగ్గులు వేసి మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటికి తోరణాలు కట్టి అలంకరించాలి.

• లక్ష్మీ పూజ చేసే సమయంలో లక్ష్మి దేవికి ఎంతో ప్రత్యేకమైన శంకువని పెట్టి పూజించాలి. శంకువు లేకపోతే లక్ష్మీ పూజ అసంపూర్ణంగా ఉంటుంది.

• ఇక దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజలో అమ్మవారికి ఇష్టమైన ఖీర్ ని నైవేద్యంగా ఉంచటం చాలా అవసరం.

• అలాగే లక్ష్మి దేవికి ఇష్టమైన తామర పువ్వులతో అమ్మవారిని పూజించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

• దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో ఆ దేవి వాహనమైన ఏనుగు ఇష్టమైన చెరుకు గడలను కూడా పూజలో ఉంచి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.

• అలాగే లక్ష్మీదేవి పూజలు తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేసి తమలపాకులను అమ్మవారి ముందు ఉంచి పూజించాలి.

• అలాగే లక్ష్మీ పూజలు ధనియాలు ఉంచి పూజ చేయడం కూడా ఆనవాయితీ గా వస్తోంది. శుద్ధమైన గిన్నెలు కొన్ని ధనియాలను ఉంచి లక్ష్మీదేవి కి సమర్పించాలి.