దన్ తేరాస్ రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు?

హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దీపావళి పండుగను సైతం దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కార్తీక మాసం కృష్ణ పక్షం మొదటి రోజు ధన్ తేరాస్ ను ఘనంగా జరుపుకుంటాము. ఈ మహా పర్వదినాన సంపదకు మూలకారకులైనటువంటి కుబేరుడు లక్ష్మీదేవిని పూజిస్తాము. ఇలా సంపదకు ఆరోగ్యానికి ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగ దినాన కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు.

దన్ తేరాస్ రోజున ఏం చేయకూడదు..

జ్యోతిష్య శాస్త్రల అభిప్రాయం ప్రకారం దన్ తేరాస్ రోజున కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయకపోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఇనుము, గాజు, సిరామిక్ వంటి పాత్రలను కొనుగోలు చేయకపోవడం ఎంతో మంచిది. పొరపాటున కూడా ఈ వస్తువులను దన్ తేరాస్ రోజున కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇకపోతే
దన్ తేరాస్ రోజున పొరపాటున కూడా ఇతరులకు డబ్బులు ఇవ్వడం ఇతరుల నుంచి డబ్బు తీసుకోవడం చేయకూడదు. ఈ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉంటే దన్ తేరాస్ ముందు చూసుకోవాలి కానీ ఇలా ఈ పండుగ రోజు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడానికి చేయకూడదు.

పాటించాల్సిన నియమాలు..

సంపదకు ఎంతో ప్రతీకగా ఉండే దన్ తేరాస్ కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది. ముఖ్యంగా నేడు చీపురు కొనుగోలు చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇలా చీపురును కొనుగోలు చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పేదరికాన్ని కూడా తరిమి కొడుతుంది. అందుకే దన్ తేరాస్ రోజున చీపురు కొనుగోలు చేయడం మంచిది.అదేవిధంగా కొత్త చీపురును కొనుగోలు చేయడంతో పాటు పేదవారికి వస్త్ర దానం చేయడం శుభసూచకం ఇలా వస్త్ర దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.