ఆస్తమా బాధితులు.. దీపావళి పండుగ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి…?

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను చిన్నా పెద్ద కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు యువకులు దీపావళి పండుగ రోజున టపాసులు పెంచటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. ముఖ్యంగా మహిళలు దీపావళి పండుగ రోజున ఇంటిని అందంగా అలంకరించి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రజలందరూ దీపావళి పండుగ జరుపుకోవడానికి ఎంత ఉత్సాహంగా ఉంటారు అంతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.

ఎందుకంటే ఈ పండగ రోజున ఎక్కడ చూసినా దీపాలు వెలిగించడమే కాకుండా టపాసులు పేలుస్తూ ఉంటారు. అందువల్ల పొరపాటున అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా ఈ దీపావళి పండుగ రోజున వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరం. దీపావళి రోజున పేల్చే టపాసుల నుండి వెలువడే కాలుష్యం కారణంగా బ్రోన్కైటిస్, ఆస్తమా, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, అలెర్జీ రినిటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో జాగ్రత్త వహించడం చాలా అవసరం.

ముఖ్యంగా ఆస్తమా వ్యాధితో బాధపడేవారు ఇంటి నుండి బయటికి రాకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ ఇంటి నుండి బయటకు రావాలనుకునేవారు ఆ కాలుష్యమైన గాలిని పీల్చకుండా ఎన్ 95 ధరించాలి. అంతే కాకుండా శరీరాన్ని హైబ్రిటేటెడ్ గా ఉంచడానికి తరచూ నీరు తాగుతూ ఉండాలి. అలాగే ఆస్తమా వ్యాధితో బాధపడేవారు ఇన్‌హేలర్‌ను ఎల్లవేళలా దగ్గరగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఆస్తమా బాధితులకు మంచి మెడిసిన్. ఇది అస్తమాను వేగంగా నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది.