ఓరి దేవుడా… డైమండ్ నెక్లెస్ దొంగలించిన ఎలుక.. వైరల్ అవుతున్న వీడియో!

సాధారణంగా బంగారు దుకాణాలలో దొంగతనాలు జరగడం మనం చూస్తుంటాము ఎంతో విలువైన వజ్రాభరణాలు బంగారు ఆభరణాలు ఉండడంతో కొందరి దొంగలు పక్కా ప్లాన్ తో రాత్రి సమయాలలో ఈ బంగారు దుకాణాలకు కన్నం వేసి దొరికిన కాడికి దోచుకొని పోతుంటారు.మరి కొన్నిసార్లు బంగారు నగలు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కస్టమర్లు కూడా తమ చేతివాటం చూపిస్తున్నటువంటి సంఘటనలను మనం చూస్తూ ఉన్నాము.

ఇలా మనుషులు దొంగతనం చేయడం సర్వసాధారణం కానీ ఎలుకలు ఎప్పుడైనా దొంగతనం చేయడం మీరు చూశారా లేక విన్నారా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఓ ఎలుక ఏకంగా డైమండ్ నెక్లెస్ దొంగలించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం తెలియక పోయినప్పటికీ ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా సిసి టీవీలో రికార్డ్ అయిన దాని ప్రకారం ఓ ఎలుక బంగారు దుకాణంలో రాత్రి సమయంలో డైమండ్ నెక్లెస్ పైకి దూకి ఏకంగా నక్లెస్ దొంగతనం చేసి దానిని తీసుకెళ్లి పోయింది.ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ ఒక భర్త పరిస్థితి అయిన ఎలుక పరిస్థితి అయిన అదే అంటూ కామెంట్లు చేయడం మరికొందరు ఎలుక తన ప్రేయసి కోసం డైమండ్ నెక్లెస్ దొంగతనం చేసిందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో అందరిని కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది.