త్రిమూర్తులలో ఒకడైన శివుడిని ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం రోజున భక్తులు శివాలయానికి వెళ్లి శివుని పూజించడమే కాకుండా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే సర్వసాధారణంగా ప్రజలు భక్తితో శివుని పూజించటం మనం చూస్తూనే ఉంటాము కానీ శివుడి వాహనమైన నందీశ్వరుడు అంటే ఎద్దు గ్రామంలోని ప్రజలందరి లాగే ఒక ఎద్దు కూడా ప్రతిరోజు శివాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామంలో ఉన్న ఎద్దు ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయితే ఎద్దు కచ్చితంగా 108 ప్రదక్షిణలు చేయడం గమనార్హం. ఎద్దు ఇలా చేయడం చూసి మొదట స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఎద్దు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తుందని లెక్కించగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా కచ్చితంగా ప్రతిరోజు 108 ప్రదక్షణలో చేస్తోంది . అయితే ఇలా శివయ్య మీద భక్తితో ఎద్దు ఇలా ప్రతిరోజు ప్రదక్షిణలు చేయడం అక్కడ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆలయంలో భక్తులు పూజ చేస్తున్నా కూడా వాళ్లతో సంబంధం లేదు అన్నట్లుగా శివయ్య మీద భక్తితో ఆ ఎద్దు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంది.
ఈ వీడియో చూసినా నెటిజన్లు ఆ ఎద్దు స్వయంగా నందీశ్వరుడు అయి ఉంటాడని అందుకే అలా ప్రతిరోజు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శివయ్య మీద తన భక్తిని చాటుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనం ఎన్ని ప్రదక్షిణాలు చేశామని లెక్క పెట్టుకుంటాము. అలా లెక్కపెట్టినా కూడా కొన్నిసార్లు లెక్క తప్పుతుంది. మరి మాటలు రాని మూగ జీవి ప్రతిరోజు కచ్చితంగా 108 ప్రదక్షిణలు చేయటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా అప్పుడప్పుడు శివలింగం చుట్టూ నాగుపాములు ఉండటం కూడా మనం చూస్తూనే ఉంటాము. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజంగా ఆ పరమేశ్వరుడి మీద భక్తి తో మానవులే కాకుండా మూగజీవులు కూడా పరవశించి పోతున్నారని అర్థమవుతుంది.