నటి మీరాజాస్మిన్ గురించి ఎవరికి తెలియని నిజాలు.. అవేంటో తెలుసా?

మీరాజాస్మిన్ దక్షిణ భారతదేశ ప్రముఖ నటి. తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో నటించింది. 1982లో కేరళలోని తిరువుల్లా లో జన్మించింది. ఈమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉంది. ఈమె పూర్తి పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. చిన్నప్పటినుండి డాక్టర్ కావాలని కోరిక ఉండేది. కానీ జువాలజీలో డిగ్రీ పట్టా పొందింది. సినిమాలలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు.

తర్వాత ఒక దర్శకుడు ఆమెను చూసి మలయాళ చిత్రం సూత్రధారంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత తమిళంలో వచ్చిన రన్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక తెలుగులో అయితే అమ్మాయి బాగుంది సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యింది. ఇలా మూడు భాషలలో నటిస్తూ బిజీగా రాణిస్తున్న సమయంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ రాజేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

తరువాత వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారంటూ చాలా రకాల వార్తలు వినిపించాయి. ఈమె దుబాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనిల్ జాన్ టైటస్ తో 2014లో తిరువనంతపురంలో ఒక చర్చిలో వివాహం చేసుకుంది. కానీ అనిల్ జాన్ కు ఇంతకుముందే వివాహం జరగడం చేత కొన్ని ఇబ్బందులు ఎదురై తర్వాత పోలీసుల సంరక్షణలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని దండలు మార్చుకున్నారు. వివాహానికి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు.

ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు దుబాయిలో ఉండి మీరాజాస్మిన్ ఒకటే ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీనిపై చాలా వార్తలు వినిపించాయి. కొందరు విడిపోయారు ఇక విడాకులు తీసుకుంటారు అంటే, మరికొందరు వివాహానికి ముందే సినిమాలలో నటించకూడదని అనిల్ మాట తీసుకున్నాడని దీని ద్వారా మనస్పర్ధలు వచ్చి ఉండనే వార్తలు వినిపించాయి.

కానీ మీరాజాస్మిన్ ఈ వార్తలపై ఎన్నడూ స్పందించలేదు. ప్రస్తుతం ఆమె సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈమధ్య మలయాళం లో మక్కల్ అనే చిత్రంలో నటించింది.