నటి ఇంద్రజకు సినిమా అవకాశాలు తగ్గటానికి ఇవే కారణాలా!

ఇంద్రజ తెలుగు, మలయాళ సినిమా నటి. ఈమె 1978లో తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. కర్ణాటక సంగీత విధ్వంసుల కుటుంబంలో జన్మించిన ఈమె అనేక సంగీత, నాటకాల పోటీలలో పాల్గొని అనేక బహుమతులు సొంతం చేసుకుంది ఈమె అసలు పేరు రజతి. ఈమెకు ఇద్దరూ చెల్లెలు ఉన్నారు. 2005లో మహమ్మద్ అబ్సర్ అనే ముస్లిం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈయన ఒక వ్యాపారవేత.

ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకొని, మూర్తి బృందం తో పాటు విదేశాలలో కూడా ప్రదర్శన ఇచ్చింది. ఇక ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన జంతర్ మంతర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను సొంతం చేసుకుని ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

కేవలం రెండు సంవత్సరాల లోనే 30కి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన సొగసు చూడతరమా సినిమాతో విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. ఇటు తెలుగులోనే కాక మలయాళం లో కూడా దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇంత స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న ఆమెకు అనుకోకుండా అవకాశాలు తగ్గటంతో కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే తన వద్ద ఉన్న మేనేజర్ సరిగ్గా పనిచేయకపోవడమే. మేనేజర్ డేట్లు అడ్జస్ట్ చేయలేక, అవకాశాల కోసం ఈమె డీటెయిల్స్ ను ఇతర నిర్మాతలకు, దర్శకులకు సరిగ్గా అందించకపోవడంతో అవకాశాలు తగ్గాయి. తర్వాత మేనేజర్ ని తీసేసి అవకాశాల కోసం ప్రయత్నిస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయింది ఆమె పరిస్థితి.

ఇంద్రజ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో 2005లో తకదిమిథ అనే తమిళ గేమ్ షోకు యాంకర్ గా కూడా పనిచేసింది. ఇక సీరియల్ లలో కూడా నటించింది సుందరకాండ అనే సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. తమిళంలో రెండు మూడు సీరియల్లలో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ వంటి షోలలో ప్రేక్షకులకు కనిపిస్తుంది.