నటి భానుప్రియ ప్రేమ వ్యవహారంలో ఎవరికీ తెలియని నిజాలు ఇవే?

భానుప్రియ తెలుగు సినీ నటిగా పరిచయం అవసరం లేని పేరు. ఈమె తెలుగు చిత్రాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఇంకా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించడం జరిగింది. ఈమె దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో నటించడం జరిగింది. భానుప్రియ 1998లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

వీరికి ఒక అమ్మాయి సంతానం. 2005లో విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది.వంశీ దర్శకత్వం వహించిన సితార సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణకమలంలో కళాకారిణిగా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక వరుస అవకాశాలతో 1983 నుండి 1995 వరకు తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్లలో తాను ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.భానుప్రియ వివాహం తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి.. భర్తతో విడాకులు తర్వాత.. తన కుమార్తెతో కలిసి చెన్నైలో సెటిల్ అయ్యి సినిమాలలో నటించడం ప్రారంభించింది. కొంతకాలం వరస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణించడం జరిగింది.

ఇక అసలు విషయం ఏంటంటే గతంలో భానుప్రియ సితార సినిమా చేసే సమయంలో దర్శకుడు వంశీ తనను ప్రేమిస్తున్నాడని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఈ ప్రేమ వ్యవహారంపై అనేక రకాల పుకార్లు వినిపించాయి. ఆ సమయంలో భానుప్రియ ఎప్పుడు తన ప్రేమ వ్యవహారంపై స్పందించలేదు.

ప్రేమను అంగీకరించకుండా వేరే వ్యక్తితో వివాహం చేసుకున్న విషయం కూడా తెలిసిందే.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భానుప్రియ తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ దర్శకుడు వంశీకి ఇంతకుముందే వివాహమైందని, తన కుటుంబ సభ్యులు వంశీ తో పెళ్లికి అంగీకరించలేదని భానుప్రియ తెలపడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో చేరింది.

ఈ విషయం తెలిసిన అభిమానులు భానుప్రియ కూడా అతనిని ప్రేమించింది అని అందుకే ఇన్ని రోజులైనా వంశి ప్రేమను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం భానుప్రియ సినిమా అవకాశాలు తగ్గడంతో, తన కూతురి బాధ్యతలు చూసుకుంటూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.