రసవత్తరంగా బిగ్ బాస్ నామినేషన్స్… సూర్యతో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన ఇనయా…?

దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ప్రసారమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో ఐదు టెలివిజన్ సీజన్లు పూర్తి చేసుకుని ఒక ఓటిటి సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ ఆరవ సీజన్ కూడా ప్రారంభం అయింది. ఇటీవల ప్రారంభమైన ఈ ఆరవ సీజన్ ఇప్పటికి ఏడు వారాల పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలో కొనసాగుతోంది. ఈ సీజన్ 6 లో 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టగా ఇప్పటికీ మొత్తం 7 మంది ఎలిమినేట్ అయ్యారు.

తాజాగా 8వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఎప్పటిలాగే 8వ వారంలో కూడా నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఈ వారంలో శ్రీ సత్య, ఇనయా, గీతు, రేవంత్ , మెరీనా ని ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఎపిసోడ్ లో గీతు , రేవంత్ మద్య మాటల యుద్ధం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ లో సూర్య తో ఉన్న రిలేషన్ గురించి ఇనయా అందరికీ క్లారిటీ ఇచ్చింది.

ఈ క్రమంలో ఇనయా మాట్లాడుతూ.. నీకు నాకు మధ్య ఏదేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. నాగార్జునసాగర్ ప్రతిసారి మీకు బుజ్జమ్మ ఉంది అంటూ గుర్తు చేస్తున్నాడు. అందువల్ల మనిద్దరం ఇలా క్లోజ్ గా ఉండటం కరెక్ట్ కాదు. మనిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. మన ఇద్దరి స్నేహం గురించి వేరేలా బయటికి వెళ్లడంతో ఇలా నేను నీతో క్లోజ్ గా ఉండటం కరెక్ట్ కాదు అందుకే ఇకపై నేను ఒక హౌస్మేట్ గా మాత్రమే నీతో ఉంటాను అంటూ చెప్పింది. దీంతో సూర్య స్పందిస్తూ.. బుజ్జమ్మ నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ. మనిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని నువ్వే అంటున్నావు. అందరూ ఏదో అనుకుంటారని ఎలా నాతో స్నేహం మానేయటం కరెక్ట్ కాదు అని అంటాడు. ఇలా సూర్యతో తనకి ఉన్న రిలేషన్ గురించి ఇనయా అందరికీ క్లారిటీ ఇచ్చింది.