Crime News: ఈ మధ్య కాలంలో యువత ప్రేమ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు వారి మాట కాదని ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి మరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాల వల్ల ప్రతి రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రేమ కోసం పరువు హత్యలు చేసే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల చోటు చేసుకుంది. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తె ప్రేమించిన వ్యక్తిని హెచ్చరించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మదురై దిడీర్ నగర్, భాస్కర్‌దాస్ నగర్‌కు చెందిన సడయాండి అను వ్యక్తి కూతురు అదే ప్రాంతానికి చెందిన రామచంద్రన్ కుమారుడితో ప్రేమలో పడింది. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి ఆమె ప్రేమను నిరాకరించాడు. ఈ తరుణంలో కుమార్తె ప్రేమించిన వ్యక్తిని తన కూతుర్ని వదిలేయ్ అని అంటూ హెచ్చరించారు. కానీ అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవటంతో అతని తండ్రితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు.
సడయాండి తన కూతురు ప్రేమ విషయం గురించి రామచంద్రన్ తో చర్చించాడు. ఈ విషయం గురించి రామచంద్రన్ కూడా స్పందించకపోవడంతో సడయాండితీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో సడయాండి శుక్రవారం అర్ధరాత్రి రామచంద్రన్ మీద కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తర్వాత తానే స్వయంగా దిరిడీ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సడయాండి నీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.