విడాకుల బాటలో తెలుగు హీరోయిన్.. రీఎంట్రీ తో క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో ఆకర్షణకు లోనై ప్రేమించుకోవడం.. అన్నీ కుదిరితే వివాహం చేసుకోవడం.. చిన్న చిన్న మనస్పర్ధలకే విడిపోవడం అన్నది సర్వసాధారణం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలే అనుకుంటారు అందరూ. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న సంఘటన జరిగిన.. అందులో వాస్తవాలు తెలియక ముందే అవి సోషల్ మీడియాలో చేరి వైరల్ గా మారుతాయి. అటువంటి వార్తల్లో ఉన్న హీరోయిన్ స్వాతి రెడ్డి గురించి ఇప్పుడు చూద్దాం.

స్వాతిరెడ్డి తెలుగు సినీనటి. సినీ ప్రేక్షకులకు కలర్స్ స్వాతిగా సుపరిచితం. మాటీవీలో ప్రసారమైన బుల్లితెర షో కలర్స్ ద్వారా పాపులర్ అయింది. 2005లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన డేంజర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో అష్ట చమ్మ, గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాల వల్ల ప్రసిద్ధి చెంది మంచి గుర్తింపు పొందింది.

తర్వాత మలయాళ, తమిళ సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో పాపులర్ నటిగా ఎదిగింది. స్వాతి సినిమా కెరీర్లో బిజీగా రాణిస్తూ.. 2018లో వికాస్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వివాహం తర్వాత కాస్త సినిమాలకు దూరమైంది. అందుకు కారణం కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయని త్వరలో విడిపోతారు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

కానీ చివరకు ఆమె సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి అందులో వాస్తవం లేదని నిరూపించింది. వివాహ బంధంతో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. 2002లో పంచతంత్రం, ఇడియట్స్, మధు మాసం లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం స్వాతి శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహిస్తున్న మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో నవీన్ చంద్ర సరసన నటిస్తుంది. ఈ సినిమాలో హీరోని ప్రేమించి.. కొన్ని మనస్పర్ధల వల్ల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించే పాత్రలో నటిస్తుంది. స్వాతి రెడ్డి నిజజీవితంలో తనపై వచ్చిన వార్తలను సినిమాలో నటించి నిజం చేసిందని చెప్పవచ్చు.