నటి సీత గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు.. అవేంటంటే?

సీత తెలుగు సినిమా నటి. ఈమె తెలుగు,తమిళ్ భాషలలో నటించింది. ఈమె 1964 లో చెన్నైలో జన్మించింది. విద్యాభ్యాసం తరువాత తన తండ్రి స్నేహితుడి సలహా మేరకు సినిమాల వైపు దృష్టి పెట్టింది. తమిళంలో విడుదలైన అణ్ పావవ్ సినిమా ద్వారా తమిళ పరిశ్రమలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత 1985 నుండి 2001 వరకు దాదాపు తెలుగు తమిళ్ భాషల్లో అందరూ హీరోల సరసన నటించింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ బిజీగా ఉన్న తరుణంలో తనతో పాటు కలిసి నటించిన తమిళ నటుడు పార్థిభన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం ఆ తర్వాత సినిమాలకు దూరమై వీరి మధ్య వివాదాలు పెరిగి 2001లో విడాకులు తీసుకుంది.

అనంతరం సినిమాలలోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ 2010లో టీవీ ఆర్టిస్ట్ సతీష్ ను రెండో వివాహం చేసుకుంది. కానీ 2016లో వీరిమధ్య వివాదాలు జరిగి విడాకులు తీసుకుంది. అయితే గతంలో ఈమె గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. చెన్నైలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్లు కథనాలు వినిపించాయి.

అయితే ఈమెకు రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ లు, ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రముఖుల సపోర్ట్ ఉన్నందున సమస్య పెద్దది కాలేదని సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినిపించాయి. మొత్తానికి ఒక వైపు వైవాహిక జీవితం దెబ్బతినడం, మరోవైపు ఇలాంటి వార్తలు ఆమెను మానసిక ఒత్తిడికి లోను చేశాయి.

కానీ ఈవిడ మాత్రం వాటిని పెడచెవిన పెట్టి సినిమాలలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో స్థిరపడింది. తన జీవితంలో హీరోయిన్ గా మంచి స్థానం సంపాదించుకొని చివరికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం బాధాకరం అని చెప్పవచ్చు.