Vishnu Vishal: బాలీవుడ్ హీరో విష్ణు విశాల్ గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని సినిమాలలో హీరోగా నటించిన ఏర్పరచుకున్నారు విష్ణు విశాల్. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్ అతని కెరియర్ గురించి అలాగే లాల్ సలాం సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. మేము ముందు అనుకున్న కథ ప్రకారం ఆ సినిమాలో హీరో నేనే. 25 నిమిషాల అతిథి పాత్ర కోసమే రజనీకాంత్ సర్ ను తీసుకున్నాము.
కాకపోతే, కొన్ని అనివార్య కారణాల వల్ల స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆయన పాత్రను పొడిగించాము. దాదాపు ఒక గంట పాటు ఆయన స్క్రీన్ పై కనిపించే విధంగా మార్పులు చేశాము. ఒక అభిమానిగా ఆ విషయంలో నేనూ సంతోషించాను. కాకపోతే, ప్రేక్షకులు స్వాగతించలేదు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పరాజయం అందుకుంది అని విష్ణు విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ చేసిన వాఖ్యలు వైరల్ గా మారాయి. అనంతరం తన కెరీర్ గురించి మాట్లాడుతూ..
సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఒక నటుడిగా నన్ను ఎవరూ గుర్తించలేదు. నా సినిమాలను ఆదరించలేదు. అందుకు నేనెంతో బాధపడ్డాను. ప్రతి ఏడాది టాప్ 20 చిత్రాల జాబితాను పరిశీలిస్తే అందులో నా సినిమా ఒక్కటైనా ఉంటుంది. కాని దానిని ఎవరూ ప్రశంసించలేదు. ఎఫ్‌ఐఆర్, మట్టి కుస్తీ చిత్రాల తర్వాత ఇండస్ట్రీ నన్ను స్వాగతించింది అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
