ప్రభుదేవాను గుడ్డిగా నమ్మిన నయనతార.. అందుకే వాళ్లకు బ్రేకప్!

ప్రభుదేవా తెలుగు సినిమాలలో డాన్స్ మాస్టర్ గా, నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన దర్శకుడి గా కూడా రాణిస్తున్నాడు. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల సినిమాలలో ప్రసిద్ధి చెందాడు. తన తండ్రి నుంచి కొరియోగ్రాఫర్ వారసత్వాన్ని కొనసాగించాడు. దాదాపుగా 25 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు.

1986లో తమిళ చిత్రం మౌనరాగం లో ఒక పాటలో వేణువు వాయిస్తూ బాలుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 1989లో కమల్ హాసన్ నటించిన వెట్రి విజయ సినిమాకు కొరియోగ్రాఫర్ గా చేయడం జరిగింది. తర్వాత నటుడిగా, దర్శకుడిగా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే నయనతార, ప్రభుదేవా ప్రేమించుకున్న విషయం అందరికీ తెలిసిందే. నయనతార కోసమే ప్రభుదేవా భార్యపిల్లల్ని కూడా దూరం చేసుకున్నాడు. చివరకు నయనతార కోసం ఏకంగా భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు.

అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ప్రభుదేవా గురించి మరో కొత్త వార్త సోషల్ మీడియాలో చేరిపోయింది. నయనతార, ప్రభుదేవాను కాదని విఘ్నేష్ ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే నయనతార కెరీర్లో బిజీగా ఉన్న సమయంలో ఈమె పారితోషకం విషయాలు అన్నీ ప్రభుదేవా చూసుకునేవాడట.

ప్రేమించిన వ్యక్తి కాబట్టి గుడ్డిగా నమ్మేసి ఈమెకు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు అన్ని చూసుకునే బాధ్యత ప్రభుదేవాకే అప్పగించిందట. వీళ్లు విడిపోయే వరకు అన్ని బాధ్యతలు ప్రభుదేవానే చూసుకుంటూ దొరికినంతవరకు దోచేశాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

నయనతార నుంచి ఏకంగా 20 కోట్ల వరకు కొట్టేయడం జరిగిందంట ప్రభుదేవా. ఈ విషయం బయటపడడం వల్లే వీళ్లు విడిపోయారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరొకవైపు విడిపోతున్నారని తెలిసే ప్రభుదేవా జాగ్రత్త పడి దొరికినంత దోచేశాడని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ తో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. మరొకవైపు ప్రభుదేవా సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. చిరంజీవి నటించి విడుదలకు రెడీగా ఉన్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక పాటకు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేయడం జరిగింది.