ఆ చిన్న హీరోతో నటించడం తన అదృష్టం అంటున్న కృతి శెట్టి!

కృతి శెట్టి భారతదేశ చలనచిత్ర నటి. కృతి చిన్నప్పుడే బ్లూ స్టార్, లైఫ్ బాయ్, పార్లే, ఐడియా వంటి సంస్థల యాడ్ లలో నటించడం జరిగింది. కృతి విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ లో అడుగు వేసింది. హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 సినిమాలో విద్యార్థినిగా నటించే అవకాశం వచ్చింది.

కృతి తొలిసారిగా 2021లో ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తర్వాత నాని సరసన నటించిన శ్యామ్ సింగారాయ్ చిత్రంలో నటించింది. మూడవ సినిమా నాగచైతన్య సరసన బంగార్రాజు సినిమాలో నటించింది. కృతి హీరోయిన్ గా నటించిన మొదటి మూడు చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్ హీరోయిన్ గా తెలుగు సినీ రంగంలో రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక కృతి ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం శృతి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. తనకు సుడిగాలి సుధీర్ తో కలిసి నటించాలని ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే త్వరలోనే సుధీర్ సరసన కృతి నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ హీరో నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని అందుకే సుధీర్ తో కలిసి నటించడం నా అదృష్టం అని తెలిపిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో బయటికి వస్తాయని, దర్శకనిర్మాతల వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్త విన్న కొందరు కథ ఎలా ఉంటుంది. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కృతి నెక్స్ట్ చిత్రం సుధీర్ తోనేనా అని నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.