kajal Pregnant: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బేబీ బంప్ తో కనిపించిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని ప్రేమించి పెళ్లాడింది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిందని, ఆమె సినిమాలకి బ్రేక్ చెప్పిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పైన కాజల్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకానొక సందర్భంలో అయితే కాజల్ తన బేబీ బంప్ గురించి తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపింది. అంతేకాకుండా తన పర్సనల్ విషయం మీద ఇంత అత్యుత్సాహం పనికిరాదని మీడియాపై సీరియస్ కూడా అయ్యింది.
కానీ, తాజాగా కాజల్ ఒక గ్రూప్ ఫోటో లో కనిపించిన తీరు ఒకెత్తు ఆశ్చర్యానికి గురిచేసింది. కాజల్ చిన్న బేబీ బంప్ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇటీవలే కాజల్.. సోదరి నిషా అగర్వాల్ కిడ్స్, స్నేహితులతో కలిసి లంచ్ ఔటింగ్ కి వెళ్ళింది. ఆ సమయంలో వచ్చిన కొన్ని ఫోటోల్లో కాజల్ అందమైన బేబీ బంప్ కనిపించింది.
దీంతో కాజల్ ప్రెగ్నెన్సీ పుకార్లు మరింత వైరల్ అయ్యాయి. ఇక కాజల్ దీనిపై స్పందించాల్సిన సమయం ఆసన్నమయిందని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన కాజల్ బేబీ బంప్ ఫోటోలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలని కాజల్ అయినా, తన భర్త గౌతమ్ అయినా అధికారికంగా ప్రకటన చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక కెరీర్ పరంగా చూస్తే.. మెగా స్టార్ చిరంజీవి ఆచార్యలో కనిపించనుంది ఈ భామ. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా నాగార్జున సినిమా నుండి, కమలహాసన్ భారతీయుడు 2 నుండి కాజల్ వైదొలుగుతుంది అన్న వార్త కూడా వినిపిస్తోంది. అంతేకాకుండా కాజల్ నటించిన పలు సినిమాలు కూడా విడుదలకి రావాల్సి ఉందని టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అన్న విషయం రానున్న రోజుల్లో తెలియనుంది.