Bollywood: 57 ఏళ్ళ వయసులో తండ్రి కాబోతున్న టాలీవుడ్ విలన్.. ఎవరో తెలుసా?

Bollywood: ఇప్పుడు మనం తెలుసుకోబోయే నటుడు ఒక స్టార్ హీరోకి సోదరుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా డైరెక్టర్గా నిర్మాతగా కూడా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీతో పాటు తెలుగు, ఉర్దూ,మలయాళం భాషల్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సదరు నటుడు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ఒక నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి దాదాపు ఒక 19 ఏళ్లు కలిసి ఉన్నారు. వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక బిడ్డ కూడా జన్మించింది.

ఆ తర్వాత వీరి దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. 2017లో తన భార్యతో విడిపోయిన ఈ స్టార్ హీరో సుమారు ఆరేళ్లు ఒంటరిగానే లైఫ్ లీడ్ చేశాడు. ఇదే క్రమంలో మరో నటితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో కలిసి రెండో సారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు రెండో భార్య గర్భం దాల్చింది. దీంతో 57 ఏళ్ల వయసులో రెండో సారి తండ్రి కాబోతుండడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ నటుడు మరెవరో కాదు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్.

మలైకా అరోరాతో విడాకులు తీసుకున్న తర్వాత, అర్బాజ్ ఖాన్ చాలా ఏళ్లు ఒంటరి జీవితాన్ని గడిపాడు. అయితే డిసెంబర్ 2023లో, అతను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వివాహం అయిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, షురా శుభవార్త చెప్పింది. త్వరలో ఖాన్ కుటుంబంలో మరొక మెంబర్ చేరనున్నారు. కొద్ది కొద్ది రోజులుగా షురా ఖాన్ గర్భంతో ఉంది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. అయితే తాజాగా ముంబైలోని ఒక దుకాణం వెలుపల షురా కనిపించింది. ఈసారి, ఆమె ముదురు నీలం రంగు బాడీకాన్ డ్రెస్, దానిపై డెనిమ్ జాకెట్ ధరించింది. ఈ డ్రెస్ లో, ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ విషయమై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. మరి ఈ విషయాన్ని ఈ దంపతులు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి మరి.