Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. పెళ్లి జరిగిన ఏడాదికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్తను అందరితో పంచుకున్నారు. లావణ్య త్రిపాటి సౌత్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ హీరోయిన్ గా బిజీగా గడిపారు. అయితే ఈమె వరుణ్ తేజ్ తో కూడా పలు సినిమాలలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది.
ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. ఇలా లావణ్య తల్లి కాబోతుందనే విషయం అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే ఇప్పటివరకు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీని ప్రకటించిన ఎక్కడ కూడా బేబీ బంప్ తో కనిపించలేదు.
తాజాగా తన భర్తతో కలిసి ఈమె మాల్దీవ్స్ వెకేషన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. తాజాగా తన మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను లావణ్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బీచ్ లో తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలలో లావణ్య త్రిపాటి బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తుందని చెప్పాలి. ఇలా మొదటిసారి ఈమె బేబీ బంప్ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు కాబోయే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.