జూనియర్ సుహాసిని కెరీర్ అతని వల్లే నాశనం అయ్యిందా?

కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ రోజులు ఉంటుందని మన అందరికీ తెలిసిందే. ఈ తక్కువ టైం లో హీరోయిన్స్ కూడా చాలా ప్లాన్డ్ గా వెళితేనే ఆ మాత్రం కెరియర్ అయిన ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తూ వెళ్తే ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం.

జూనియర్ సుహాసిని అయిన బాలాదిత్య హీరోగా పరిచయమవుతూ బి.జయ దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటిగాడు సినిమాతో మంచి హిట్ సాధించినప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఆవిడ తమిళం, భోజ్ పూరి సినిమాల్లో ఎక్కువగా నటించింది. అయితే జూనియర్ సుహాసిని గా తెలుగులో మంచి గుర్తింపు సాధించినప్పటికీ తెలుగులో చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసింది తప్ప పెద్ద హీరోలతో అవకాశాలు రాలేదు.

చంటిగాడు సినిమా త‌ర్వాత ఆమెకు ఓ బ‌డా డైరెక్ట‌ర్ ఫోన్ చేశాడని తెలియజేసింది. ఆమెకు సినిమా ఆఫ‌ర్లు ఇప్పిస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ త‌ర్వాత ఆయ‌న అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టాడట. తనకు సినిమా ఆఫ‌ర్లు ఇవ్వాలంటే ఆమె అతనికి క‌మిట్ మెంట్ ఇవ్వాలనీ లైవ్ లో బ‌ట్ట‌లు తీసేసి చూపించాలి అంటూ చాల నీచంగా మాట్లాడాడనీ ఈ విషయాలను బయపెట్టింది.

ఆ విష‌యాలు ఆమెకు అస్స‌లు ఇష్టం లేక‌పోవ‌డంతో అప్ప‌టి నుంచే ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుందట. అయితే మ‌ధ్య‌లో సీరియ‌ల్స్ లో అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డ కూడా ఎంట్రీ ఇచ్చింది. సీరియ‌ల్స్ లో చేస్తున్న స‌మ‌యంలోనే మ‌ళ్లీ సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అదేం దుర‌దృష్ట‌మో తెలియ‌దు గానీ.. స‌ద‌రు డైరెక్ట‌ర్ మ‌ళ్లీ ఆమెను ఫోర్స్ చేశాడనీ తెలిపింది. రూమ్ కి రమ్మంటూ ఇబ్బంది పెట్టేసరికి చ‌చ్చినా స‌రే ఇండ‌స్ట్రీ వైపు వెళ్ల‌ను అని ఆమె నిర్ణ‌యించుకుని ఇప్పుడు సీరియ‌ల్స్ లోనే చేస్తోంది.

అయితే మధ్యలో కొన్ని రోజులకు రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమాలో దేవుడి భార్య లో ఒక భార్య గా నటించినప్పటికీ దానివల్ల పెద్దగా ఉపయోగం లేకపోయింది. అప్పుడు చేసిన చిన్న సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దాంతో సుహాసిని సినిమా కెరియర్ తక్కువ కాలంలోనే ముగిసింది. అయితే ఆవిడతో పాటు ఆ టైంలో ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ అయిన త్రిష, ఇలియానా లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా గుర్తింపు పొందింది.

అయితే ఒక దగ్గర ఫ్లాప్ అయినంత మాత్రాన నిరుత్సాహ పడకుండా సుహాసిని బుల్లితెరపై మ్యాజిక్ చేయడానికి సీరియల్స్ లో నటించడం జరిగింది. ఆవిడ నాగబాబు తనకు తండ్రిగా నటించిన అపరంజి సీరియల్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో సీరియళ్లలో నటిస్తూ ఇప్పటికీ బుల్లితెరపై తన నటనా ప్రతిభను చూపిస్తూ ప్రశంసలు అందుకుంది. ఇద్దరమ్మాయిలు అనే సీరియల్ లో నటిస్తూ నప్పుడు తన కో స్టార్ అయిన ధర్మ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

అయితే ఇప్పుడు ఆమె బుల్లితెరపై వరుస సీరియల్స్ లో నటిస్తూ సీరియల్ నటిగా చాలా బిజీ అయిపోయారు.