Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తరచూ అవమానాలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి నుంచి ఈయన అవమానాలను ఎదుర్కొంటున్నారని చెప్పాలి. తాజాగా మరొక టాలీవుడ్ హీరో సైతం సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి సీఎం రేవంత్ పేరు మర్చిపోయినటువంటి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే..
ఒకప్పుడు నటుడిగా సినిమా ప్రేక్షకులను బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన వారిలో బాలాదిత్య ఒకరు. తాజాగా ఈయన హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన తరుణంలో ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ బాలాదిత్య నోరు జారారు.
మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్‌కుమార్ గారు అంటూ మాట్లాడారు. ఇలా ఒక్కసారిగా ఆయన కిరణ్ కుమార్ అని పిలవడంతో అక్కడున్నటువంటి వారందరూ కేకలు వేయగా తన తప్పును గ్రహించిన బాలాదిత్య తలకు చేయి పట్టుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. కాసేపటికి తిరిగి వేదిక పైకి వచ్చి క్షమించాలి అంటూ క్షమాపణలు చెబుతూ మరోసారి రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వీడియో పై ఎంతో మంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. లక్కీగా సీఎంలైతే ఇలాగే ఉంటుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం త్వరలోనే ఈయన కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయారు. ఇలా తన పేరు మర్చిపోయినందుకే తనని టార్గెట్ చేస్తూ అరెస్టు చేయించి జైలుకు పంపించారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇలా ఈ ఘటన మరువకముందే బాలాదిత్య సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది.
మళ్ళీ ఘోర అవమానానికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనం
త్వరలో జైలుకి వెళ్లనున్న మరో యాంకర్ అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు https://t.co/vY2w4RJZ2O pic.twitter.com/GEaoPEjYZi
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025