తెలుగు సమాఖ్య మహాసభలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పేరు తొలుత హోస్ట్‌గా ఉన్న బాలాదిత్య తప్పుగా పిలవడం చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డిని పరిచయం చేసే సమయంలో “తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్” అని చెప్పి, వెంటనే తన తప్పును గుర్తించిన బాలాదిత్య క్షమాపణలు చెప్పడం వైరల్ అవుతోంది.
ఈ పొరపాటు కారణంగా సభలో కాస్త అలజడి క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ టంగ్ స్లిప్ వీడియో వైరల్ అవుతూ, నెటిజన్లకు కొత్త చర్చలకు తావిచ్చింది. “బాలాదిత్యకు కూడా కష్టాలు మొదలయ్యాయి” అంటూ కొన్ని కామెంట్లు వ్యంగ్యంగా వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్‌లో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం అప్పట్లో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలాదిత్య పొరపాటు అందుకు సరదాగా సంబంధం కల్పించారు.
వేదికపైనే రాజకీయ నాయకుల పేర్లు తప్పుగా చెప్పడం మామూలేనని, ఇది పెద్ద తప్పు కాదని కొందరు అభిప్రాయపడ్డారు. మరోవైపు, “ఇలాంటి సంఘటనలు ప్రముఖ కార్యక్రమాల్లో మరీ జాగ్రత్తగా చూడాలి” అంటూ రాజకీయ విశ్లేషకులు సూచించారు. బాలాదిత్య ఉద్దేశపూర్వకంగా చేసిన పొరపాటు కాదని అతని అభిమానులు చెప్పడం గమనార్హం. ఈ చిన్న పొరపాటు రేవంత్ రెడ్డిపై మరోసారి దృష్టిని మరలించింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల పేర్లు, గౌరవాలు ఉద్దేశపూర్వకంగా పలకడం ద్వారా హోస్టింగ్ చేసే వారిపై కూడా ఇలాంటి టంగ్ స్లిప్‌లు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
ఉన్న ఇజ్జత్ పాయే ఉంచుకున్నది పాయే 🤣🤣🤣
— వరంగల్ కింగ్ 🤘🏻 (@WarangalKing) January 5, 2025