తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు వారి సినిమా విషయాలను స్వయంగా వారికి చూసుకోవడం చేతకానిపక్షంలో పూర్తిగా ఆ వ్యవహారాలన్నింటిని మేనేజర్లపై పెట్టి ఆ బాధ్యత మొత్తం వారికే అప్పచెప్పుతారు.ఇలా ఎంతోమంది తమ సిని కెరియర్ మొత్తం మేనేజర్ చేతిలో పెట్టి వీళ్ళు కేవలం సినిమా షూటింగ్లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. ఈ విధంగా ఎంతో మంది మేనేజర్లు హీరోయిన్లను పెద్ద ఎత్తున మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.
సాధారణంగా మేనేజర్లు హీరోయిన్లకు అవకాశాలు తీసుకురావడానికి ఎంతగానో దోహదపడతారు కానీ కొంతమంది హీరోయిన్లు విషయంలో మాత్రం మేనేజర్లు చేసిన నమ్మకద్రోహం కారణంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన సందర్భాలు ఏర్పడ్డాయి. ఇలా మేనేజర్ల వల్ల మోసపోయిన వారిలో జూనియర్ సుహాసిని ఒకరు.తెలుగులో చంటి సినిమా ద్వారా హీరోయిన్ గా సందడి చేసిన ఈమె ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు అయితే ఈమె తమిళం భోజ్ పురి సినిమాలలో కూడా నటించి మెప్పించారు.
ఇక ఈమె కూడా తన రెమ్యూనరేషన్ ఓపెన్ గామేనేజర్లకు చెప్పడంతో మేనేజర్లు సైతం ఈమె కన్నా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ఇతర హీరోయిన్లు నటిస్తారంటూ ఈమెకు అవకాశాలు రాకుండా చేయడం వల్ల ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా తనకు అవకాశాలు రాకపోవడంతో ఈమె క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమై బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కేవలం మేనేజర్ల కారణంగానే స్టార్ హీరోయిన్ కావాల్సిన సుహాసిని వెండితెరకు దూరమయ్యారు.