తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసిన నటి జ్యోతి.. ఆ పాత్రలే వస్తాయంటూ!

జ్యోతి తెలుగు సినీనటి. సినిమాలలో ర్యాంప్ పాత్రల ద్వారా బాగా ప్రసిద్ధి చెందింది. ఈమె తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెరిచిందే.

తనకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎమ్మెస్ రెడ్డి దర్శకత్వం వహించిన అందం చిత్రం ద్వారా అడుగు పెట్టడం జరిగింది. ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన హంగామా చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని పలు వరుస సినిమాలలో నటించడం జరిగింది.

జ్యోతి ఎక్కువగా హాస్య కథ చిత్రాలలో నటించడం జరిగింది. ఇక ఈమె 2010లో సెక్స్ రాకెట్ ఆరోపణల ద్వారా పోలీసులు అరెస్టు కావడం జరిగింది. తర్వాత ఆ కేసు నుండి విజయవంతంగా బయటపడడం జరిగింది. ఇదంతా తనంటే గిట్టని వాళ్లు కావాలని చేసినట్లుగా పేర్కొనడం జరిగింది.

ఇలా వరుసగా కామెడీ చిత్రాలలో రాణిస్తున్న జ్యోతి గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకోవడం జరిగింది. అదేమిటంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ పాత్రలో అయితే సక్సెస్ అయితే అటువంటి పాత్రలే అవకాశాలుగా వస్తాయి. వేరే పాత్రలలో దాదాపుగా అవకాశాలు రావని తెలిపింది.

తాను ర్యాంప్ పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందిన కూడా ఇతర పాత్రలలో నటించాలని ఎంతో ఆసక్తిగా ప్రయత్నించిన ఎక్కువగా ర్యాంప్ పాత్రలే వచ్చాయని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి మారితే చాలా బాగుంటుందని అభిప్రాయపడింది. ఇక తాను చేసిన సినిమాలలో బాగా ఇష్టపడే చేసిన సినిమా మహాత్మా అని తెలిపింది.

అన్ని సినిమాలు అవకాశాలుగా వస్తే చేశానని, మహాత్మ సినిమాలో తన పాత్ర ఎంతో నచ్చి వెంటనే ఓకే చెప్పానని తెలపడం జరిగింది. ప్రస్తుతం జ్యోతి మలయాళంలో రెండు సినిమాలకు సంతకాలు చేసి, షూటింగ్లలో బిజీగా ఉన్నట్లు సమాచారం.