శివలింగం పచ్చగా ఉండే ఆలయం గురించి తెలుసా.. ఇక్కడ అభిషేకం చేస్తే కష్టాలు తీరినట్టే?

మనలో చాలామంది భక్తులు శివుడిని దర్శించుకుంటూ కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే ఒక ఆలయంలో మాత్రం శివలింగం పచ్చగా ఉండటం గమనార్హం. ఆ ఆలయంలో శివునికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు భావిస్తారు. సాధారణంగా ఏ గుడిలోకి వెళ్లిన గర్భగుడిలోకి వెళ్లడానికి భక్తులకు రైట్ ఉండదు. నల్గొండ జిల్లా ఇనుపాముల గ్రామంలో ఉన్న ఆలయంలో మాత్రం గర్భగుడిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు పచ్చర్ల సోమేశ్వర స్వామి అని పిలుచుకుంటారు. ఈ ఆలయంలో దేవునికి అభిషేకాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం కాగా కాకతీయులు ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాలలో సైతం ప్రముఖ ఆలయాలను నిర్మించడం జరిగింది.

ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మళ్లీ మళ్లీ దేవుడిని దర్శించుకోవడానికి వస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి పండుగల రోజున ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువమంది భక్తులు వస్తారని తెలుస్తోంది.

ప్రతి భక్తుడు తమ జీవితంలో ఒకసారైన ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల ద్వారా సులభంగానే చేరుకునే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఆలయానికి ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.