కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన విష్ణు ప్రియ… చూస్తే పిచ్చెక్కిపోవాలి అంటూ కామెంట్స్?

బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా అని షోలో యాంకర్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ ఆ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఇతర టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించే అవకాశం రాకపోవటంతో సినిమాలలో అవకాశాలు అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో తన గ్లామర్ డోస్ పెంచింది అందరినీ రెచ్చగుతోంది. సినిమా అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరినీ తన అందాలతో రెచ్చగొడుతోంది.

ఇలా గ్లామర్ డోస్ పెంచిన విష్ణు ప్రియ పొట్టి బట్టలు వేసుకొని ఎద అందాలు నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ అందాల ఆరబోత వల్ల ఇటీవల సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది. ఈ క్రమంలో రాఘవేంద్రరావు సమర్పణలో విడుదలైన వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇలా హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన విష్ణు ప్రియ తనకి కాబోయే భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న విష్ణు ప్రియ తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో వివరిస్తూ… తనని పెళ్లి చేసుకోబోయే వాడికి ఆ దేవుడికి ఉన్నంత ఓపిక ఉండాలని..చాలా హైట్ గా అరబిక్ అబ్బాయిలా ఫేస్ కట్ ఉండాలని చెప్పుకొచ్చింది. అలాంటి అబ్బాయిలను బయట చూసినప్పుడు తనకి పిచ్చెక్కిపోతుందని … అలాంటి అందగాడు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే తప్పకుండా ఓకే చెబుతా అంటూ హాట్ కామెంట్స్ చేసింది. విష్ణు ప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.