ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన మిహికా… మ్యారీడ్ లైఫ్ లోనే ఉన్నా అంటూ కామెంట్?

గత కొద్ది రోజులుగా రానా దంపతులు త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారని రానా తండ్రి కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విధంగా రానా భార్య మిహికా ప్రెగ్నెంట్ అనే వార్త వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన రానుందని భావిస్తున్న తరుణంలోనే ఈ వార్తలపై మిహికా స్పందించారు. ఈ సందర్భంగా మిహికా ప్రెగ్నెన్సీ వార్తలు గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మిహికా తనకు సంబంధించిన అన్ని విషయాలను అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలలో మిహికా కాస్త బొద్దుగా ఉండటంతో ఈమె తల్లి కాబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక కొంతమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా ప్రశ్నిస్తూ మీరు నిజంగానే తల్లి కాబోతున్నారా అంటూ అడిగారు.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నేను ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లోనే ఉన్నాను అందుకే ఈ మధ్య కాస్త హెల్ది అయ్యాను అంటూ సమాధానం చెప్పారు.ఇలా తన మ్యారీడ్ లైఫ్ లో సంతోషంగా ఉండటం వల్ల కాస్త శరీర బరువు పెరగానని అంతకుమించి తాను ప్రెగ్నెంట్ కాదు అనే విషయాన్ని ఈమె తెలియజేశారు. ఇలా తన గురించి వస్తున్నటువంటి ప్రెగ్నెన్సీ రూమర్లకు ఈమె చెక్ పెట్టారు.