అమ్మాయిలు మొదటిసారి డేట్ కి వెళ్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందే?

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు డేట్ లో ఉండడం డేటింగ్ కు వెళ్లడం వంటివి సర్వసాధారణంగా జరిగే అంశాలు. అయితే మొదటిసారి డేట్ కి వెళ్తున్నప్పుడు తెలియని సంతోషం, సంకోచం, సందిగ్ధత, భయం ఇలా చాలా ఎమోషన్స్ వెంటాడుతూ ఉంటాయి. అంతకు ముందు రోజు రాత్రి సరిగా నిద్రకూడా పట్టకపోవచ్చు. ఇలా మొదటిసారి డేటింగ్ వెళ్లే సమయంలో అమ్మాయిలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

మొదటిసారి కలుస్తున్నారు కాబట్టి మీరు మంచిగా, ప్రశాంతంగా కూర్చుని మాట్లాడగలిగే స్థలాన్ని అమ్మాయిలే ఎంచుకోండి. ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు.. మీరు మంచిగా మనసు విప్పి మాట్లాడుకోగలరు. అలా అని జనాలు లేని మారుమూల ప్రదేశాలకు అస్సలు వెళ్లొద్దు. వచ్చే వ్యక్తి ఎలాంటివాడో తెలియదు కాబట్టి మీ సేఫ్టీని చూసుకోండి. డేట్‌కు వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీ వెహికల్‌లోనే వెళ్లండి. లేదంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించండి. వచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఫస్ట్ డేట్ కి వెళ్తున్నప్పుడు పికప్ చేసుకోవాలని, డ్రాప్ చేయాలని ఆశించకండి.

ఫస్ట్ డేట్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మీ మధ్య రాజకీయాలు, ఆర్థిక, మతం, కులం, ప్రాంతం వంటి అంశాల గురించి ప్రస్తావనకు రాకూడదు ఒకవేళ వచ్చిన దీనిని పూర్తిగా పక్కన పెట్టడం మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ డేట్‌లో మాట్లాడేటప్పుడు ఏదైనా ఫుడ్, డ్రింక్స్ ఆర్డర్ చేస్తే.. బిల్లు షేర్ చేసుకోవడానికి సంకోచించవద్దు. దీనివల్ల మీకు గిల్టీ ఫీలింగ్ ఉండదు. సాఫీగా మాట్లాడుకోవచ్చు. అతనే బిల్ కడతానని పట్టబడితే సరేనని థ్యాంక్స్ చెప్పండి.మీరు మొదటిసారి డేట్ వెళ్లినప్పుడు అబ్బాయి మీ ఆస్తుల గురించి ఇతరుల గురించి తక్కువగా మాట్లాడినప్పుడు ఇతర లోపాలను ఎత్తిచూపుతున్నప్పుడు అలాంటి వారిని కాస్త దూరంగా పెట్టడం మంచిదని గుర్తుంచుకొని ఇంకొకసారి వాళ్లతో కలిసి డేట్ కి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్త పడండి.