ఎంత ప్రేమని చూశానో అంత నెగిటివిటీని కూడా చూశాను.. స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్!

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు షణ్ముఖ్ జస్వంత్.సోషల్ మీడియాలో ఈ పేరు చాలా పాపులర్. తెలుగులో అత్యధిక సబ్స్క్రైబ్ కలిగిన మొదటి యూట్యూబ్ గా రికార్డు క్రియేట్ చేసుకున్న వ్యక్తి షణ్ముఖ్. అయితే గత కొద్ది రోజులుగా అతని జీవితంలో ఎదురైన సమస్యలతో సతమతమవుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంచెం సైలెంట్ అయ్యాడు.

కెరియర్ పీక్స్ లో ఉండగానే దీప్తి సునయన అనే మరొక యూట్యూబర్ తో ప్రేమాయణం నడిపాడు కానీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పార్టిసిపేట్ చేసిన తరువాత సిరి తో అతను ప్రవర్తించిన తీరుకి హర్ట్ అయిన దీప్తి అతనితో బ్రేకప్ చెప్పడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. మళ్ళీ కొన్నాళ్ల తర్వాత గంజాయి సేవించాడని పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని మోసం చేశాడని అతడిని పట్టుకోవడానికి వెళ్తే గంజాయి సేవించి ఉన్న షణ్ముఖ్ ని పోలీసులు పట్టుకోవటం.

ఇలా ఎన్నో వివాదాలలో చిక్కుకొని గత ఏడాది కాలంగా ఎలాంటి కంటెంట్ లేకుండా ఉన్న షణ్ముఖ జస్వంత్ ప్రస్తుతం లీలా వినోదం ద్వారా మన ముందుకి రాబోతున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం ఈటీవీ విన్ లో డిసెంబర్ 19 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా పెట్టిన ప్రెస్ మీట్ లో షణ్ముఖ్ మాట్లాడుతూ ఏడ్చేసాడు. తన జీవితంలో ఎంత ప్రేమను చూశానో అంత నెగిటివిటీని కూడా చూశాను.

వైజాగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నేను హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ లో చేసుకున్నాను. నాకు ఎలాంటి సపోర్టు లేదు నేను అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి, కానీ చేయని తప్పులకి నన్ను బ్లేమ్ చేశారు. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు కానీ మనం పడినప్పుడు మన పక్కన ఉండే వాళ్ళే నిజమైన వాళ్ళు. నిజంగా నా మీద మచ్చ ఉన్న సమయంలో కూడా లీలా వినోదం టీం నాకు ఈ ఆఫర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్ జశ్వంత్.