బిగ్ బాస్ షోలో కాస్టింగ్ కౌచ్.. అసలు నిజాలు బయటపెట్టిన శివజ్యోతి!

ప్రముఖ వార్త ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయింది యాంకర్ శివజ్యోతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని కూడా ఇంకా మంచి గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ షోతో శివ జ్యోతి క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతకు ముందు ఇస్మార్ట్ వార్తలతో సావిత్రి అంటూ తెలంగాణ ప్రజలను పలకరిస్తుండేది.

శివజ్యోతికి చాలా సంవత్సరాల ముందే గంగూలీ అనే వ్యక్తితో పెళ్లి కూడా జరిగిపోయింది. శివ జ్యోతి తన భర్త గంగూలితో కలిసి అనేక షోల్లో సందడి చేసింది. ఓంకార్ ఇస్మార్ట్ జోడి వంటి షో ద్వారా శివ జ్యోతి భర్త గంగూలి సైతం ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తరువాత శివ జ్యోతి తన క్రేజ్‌ను బాగానే వాడుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటూ.. తన ఫాలోవర్లకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.

బిగ్ బాస్ ఇంట్లో ఆమెకు పాతాళ గంగ అని పేరు వచ్చింది. ప్రతీ చిన్న దానికి కుళాయి ఓపెన్ చేసింది. ఎవరో చచ్చిపోయినట్టుగానే ఏడుస్తుండేది. ఆ ఏడుపు మొహాన్ని చూడలేకే జనాలు ఎలిమినేట్ చేసేశారు.
బిగ్ బాస్ మూడో సీజన్లో శివ జ్యోతి ఎంట్రీ ఇచ్చింది. స్క్రీన్ నేమ్ సావిత్రి అని.. కానీ తనకు శివజ్యోతిగా గుర్తింపు రావాలని అందుకే బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చానని అప్పుడు చెప్పింది శివజ్యోతి.

అయితే గతంలో ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. మరి బిగ్ బాస్ లో ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని బయట ప్రచారం జరుగుతోందని ఈ విషయంపై తన స్పందన ఏమిటని శివజ్యోతిని ప్రశ్నించగా.. కమిట్మెంట్ సంగతి తనకు తెలియదని..

ఇతర కంటెస్టెంట్ల విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ తన విషయంలో మాత్రం ఎలాంటి కమిట్మెంట్ కి సంబంధించిన విషయాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. తను బిగ్ బాస్ హౌసులోకి వెళ్లి వచ్చినందుకు ఆమె ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పాలని తెలియజేసింది. ఇంకా ఇలా వచ్చిన వార్తలు వైరల్ అయిన కామెంట్స్ అవన్నీ అబద్దం అని చెప్పుకుంటూ వచ్చింది.

అలాగే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు రోజులో ఎక్కువ సేపు మేల్కొనే ఉండాలని అంతేగాక ఆహార పదార్థాల విషయంలో కూడా షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పాటిస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివజ్యోతి టీవి ఛానెల్ లో వర్క్ చేస్తూనే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.