వామ్మో.. పెళ్లి కంటే సహజీవనం బెటర్ అంటున్న నటి మాధవి లత!

Madhavi Latha Fires On Netizens About Current Bills

మాధవి లత తెలుగు సినిమా నటి. ఈమె తెలుగు తమిళం చిత్రాలలో నటించింది. 2008లో విడుదలైన నచ్చావులే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో కొంతకాలం బిజీగా గడుపుతూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఇలా కెరీర్ లో ముందుకు వెళ్తున్న మాధవి లత గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో తనకు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. అందుకు సమాధానంగా సింపుల్ గా ఒక మాటలో పెళ్లి కంటే సహజీవనం బెటర్ అని తేల్చి చెప్పేసింది.

తన అభిప్రాయం ప్రకారం పెళ్లి చేసుకుని కొంతకాలం తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగేవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విడాకులు తీసుకున్నాక సెకండ్ మ్యారేజా, థర్డ్ మ్యారేజా అంటూ సమాజం ప్రశ్నిస్తూ ఉంటుంది. అదే ఎంచక్కా మనసులు కలిశాక లివింగ్ రిలేషన్ లో ఉంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు నచ్చకపోతే హ్యాపీగా ఎవరు దారి వారు చూసుకోవచ్చు.

విడిపోయిన తర్వాత ఎవరికీ ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం ఉండదు. ఆస్తి తగాదాల ప్రస్తావన ఉండదు. పెళ్లి చేసుకొని నచ్చని జీవితం అనుభవించడం కంటే లివింగ్ రిలేషన్ బెటర్ అని పేర్కొనడం జరిగింది. తరువాత కొంతమంది అసభ్యకరంగా ఉంచుకోవడం అనే మాటను ఎక్కువగా ప్రస్తావించారు.

మనం మనుషులం, వస్తువులం కాదు ఎక్కడపడితే అక్కడ ఉంచడానికి, తన దృష్టిలో ఆడవాళ్లు, మగవాళ్లు సమానమే అని అందరికీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేటివి ఉంటాయని నచ్చినంత కాలం కలిసి జీవించడంలో తన దృష్టిలో తప్పేమి కాదని పేర్కొంది. ఈమె చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈమె భారతీయ జనతా పార్టీలో ఉండి రాజకీయాలలో రాణించాలి అని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.