తన చేతులారా తన సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న హీరో వేణు.. ఇంతకు ఏం జరిగిందంటే?

వేణు తెలుగు చలనచిత్ర నటుడు. ఇతను ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించడం జరిగింది. ఇతను అనేక విజయవంతమైన తెలుగు చిత్రాలలో ప్రధాన నటుడుగా కనిపించాడు. ఇక వేణు తన స్నేహితుడు వెంకట శ్యాంప్రసాద్ స్థాపించిన ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 1999లో కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారానే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక 2000 లో కూడా మరోసారి చిరు నవ్వుతో సినిమాతో భారీ విజయం సొంతం చేసుకున్నాడు. తరువాత నటించిన మనసు పడ్డాను కానీ, వీడెక్కడి మొగుడండి చిత్రాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. తర్వాత హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే చిత్రాల ద్వారా విజయాలను అందుకున్నాడు.

ఇలా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా రాణిస్తున్న సమయంలో సడన్ గా అవకాశాలు తగ్గి సినీ ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యాడు. తరువాత చింతకాయల రవి సినిమాలో ఒక సహాయ పాత్రలో కనిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో కూడా ఒక సహాయ పాత్రలో నటించడం జరిగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలలో సహాయక పాత్రలలో రాణిస్తున్న వేణు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఆ ఇంటర్వ్యూలో తనకు బాగా బిజీగా ఉన్న సమయంలో సడన్ గా మీ సినిమాలు రాకపోవడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. అందుకు తాను నన్ను కావాలని తొక్కేశారో… లేదంటే అలా జరిగిందో తెలియదు కానీ కథ విని ఓకే చెప్పేశాక, రేపు షూటింగ్ అన్నప్పుడు స్క్రిప్ట్ మారితే తనకు ఏం చేయాలో అర్థం కాలేదట. దర్శక నిర్మాతలను అడిగితే పర్వాలేదు మేము ఉన్నాం కదా అంటారు.

ఇక ముందుగానే మాట ఇచ్చేసాం కాబట్టి మొహమాటం కొద్ది ఏమీ అనలేని పరిస్థితి. ఆ మొహమాటం వల్లే నాకు సినిమా అవకాశాలు తగ్గాయని పేర్కొనడం జరిగింది. ఇక ముందు చేయబోయే సినిమాలలో తన పాత్రలకు గుర్తింపు ఉంటేనే నటిస్తానని చెప్పడం జరిగింది. వేణు ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన విషయం తెలిసిందే.