Sai pallavi: ఎల్లమ్మగా నటి సాయి పల్లవి… రికార్డులు బద్దలు కావాల్సిందే?

Sai pallavi: బలగం సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ వేణు. జబర్దస్త్ కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన దర్శకత్వంపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బలగం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ఈ సినిమా ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఎన్నో అవార్డులు పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వేణు మరొక తెలంగాణ నేపథ్యంలో కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సమాచారం అయితే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని ఇటీవల వేణు ఓ సందర్భంలో వెల్లడించారు ఈ సినిమాలో కూడా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా వేణు ఈ కథ రాసుకున్నాడట. ఎల్లమ్మ కోసం పోరాడిన దళిత యువకుడి కథే, ఎల్లమ్మ సినిమా అని సమాచారం. ఎల్లమ్మ హిందువుల ఆరాధ్య దైవం. కొన్ని ప్రాంతాల్లో ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు.

ఇలా ఈ సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాబోతుందని వెల్లడించారు అయితే ఈ సినిమాలో హీరోగా మొదట నితిన్ నటించిన నటించబోతున్నారని వార్తలు వచ్చాయి అయితే నితిన్ ఈ సినిమాకు ఆసక్తి చూపడం లేదని తెలియడంతో నాని వద్దకు వెళ్లారు. అయితే నాని కూడా ఈ సినిమాకు నో చెప్పినట్టు తెలుస్తుంది. ఫైనల్ గా ఈ సినిమాకు నితిన్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక హీరోయిన్గా సాయి పల్లవి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. సాయి పల్లవి కథ మొత్తం విన్న తర్వాత తనకు ఎంతో అద్భుతంగా నచ్చిందని అందుకే ఈ సినిమా చేయటానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

సినిమా కథలను ఎంతో సెలెక్టివ్ గా ఎంపిక చేసే సాయి పల్లవి ఎల్లమ్మ సినిమాకు కమిట్ అయ్యారు అంటే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే అభిమానులు భావిస్తున్నారు ఇటీవల కాలంలో సాయి పల్లవి నటిస్తున్న సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈమె చివరిగా అమరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె ఓ తమిళ సినిమాతో పాటు రెండు బాలీవుడ్ చిత్రాలు అలాగే తెలుగులో తండేల్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు.