సంఘవి సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదే.. అసలేం జరిగిందంటే?

సంఘవి ఎక్కువగా తెలుగు కన్నడ సినిమాలలో నటించడం జరిగింది. 95కు పైగా సినిమాలలో నటించిన ఆమె 1993 నుండి 2004 వరకు ఒక దశాబ్దం పాటు దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అగ్రగామి హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె పదహైదు సంవత్సరాల తన కెరీర్‌లో ఎనభై చిత్రాలలో నటించింది. అందులో తెలుగులో 36 చిత్రాలు, తమిళంలో 35 చిత్రాలు, కన్నడలో ఆరు చిత్రాలు, మలయాళంలో రెండు సినిమాలు మరియు హిందీలో ఒకటి.

సంఘవి అసలు పేరు కావ్య అని ఆమె కర్ణాటకలోని మైసూరులో 1977వ సంవత్సరంలో అక్టోబరు 4న పుట్టిందనీ ఒకప్పుడు ఆమె చెప్పడం జరిగింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగానికి అధిపతి. ఈమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో సాగింది. సంఘవి యుక్త వయసునుండే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. చిన్నపట్టి నుండే సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. అయితే ముందుగా వాళ్ల నాన్న ఆమెను డాక్టర్ చేయాలని భావించాడట.

ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేదనీ ఆమె ఒకప్పుడు చెప్పుకున్నారు. ఆమెకు అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడిందట. ఈమె తన మొదటి సినిమా అంటే అది ఒక తమిళ సినిమా అయిన అమరావతిలో అజిత్ సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ తరువాత సంఘవికి సిందూరం సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే నంది అవార్డు అందుకున్నది. ఈ సినిమాకు దర్శకుడిగా కృష్ణవంశీ చేయడం జరిగింది.

ఆమె కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే సంఘవి తెలుగు సినిమా దర్శకుడు అయిన సురేష్ వర్మను శివయ్య సినిమా నిర్మాణ సమయములోనే ప్రేమించి పెళ్ళి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత సినీరంగంలో పునఃప్రవేశించి ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్రను పోషించింది. అదే కాక గోకులత్తిల్ సీత అనే టీవీ సీరియల్ తో బుల్లితెరపై కూడా అడుగుపెట్టింది.అలాగే పొర్కాలం అనే చిత్రంలో నటించింది.

సంఘవి 2005 సంవత్సరంలో షూటింగ్ కోసమని మైసూర్ నుండి చెన్నైకి ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఆమె ముక్కుకు పెద్ద గాయం అవ్వడం వలన ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలిపారు. మైసూర్ మెడికల్ కాలేజీలో ENT ప్రొఫెసర్‌గా డాక్టరుగా ఉన్న ఆమె తండ్రి ముక్కుకి శస్త్రచికిత్స చేశారనీ తెలిపింది.

సంఘవి ఫిబ్రవరి మూడవ తేదీన 2016 సంవత్సరంలో తాజ్ వివంత బెంగుళూరులో IT ప్రొఫెషనల్ వెంకటేష్‌ని రెండో వివాహం చేసుకోవడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. 2020వ సంవత్సరంలో జనవరిలో ఈ దంపతులకు ఆడపిల్లకు జన్మనిచ్చింది. అలాగే ఆమె మా టీవీకి రంగం అనే షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.

ఇంకా ఈటీవీలో ప్రసారం అయ్యే కామెడీ షో జబర్దస్త్ లో కూడా జడ్జిగా వచ్చారు ఆమె. పొర్కాళ్లం చిత్రానికి ఉత్తమ సహాయ నటి గా అవార్డు తీసుకుంది. ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం ఎదురుచూస్తుందని రీసెంట్ జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలియజేయడం జరిగింది.