నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ncrtc.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
జనరల్ మేనేజర్/ఐటి (సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్) జాబ్ ఒకటి ఉండగా అడిషనల్ జనరల్ మేనేజర్/ఐటి (సొల్యూషన్ ఆర్కిటెక్ట్) 1, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్/ ఐటీ (వెబ్ డెవలపర్) 1, డిప్యూటీ జనరల్ మేనేజర్/ ఐటీ (క్లౌడ్ ఎక్స్‌పర్ట్) ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా సంబంధిత అర్హతలను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 2.6 లక్షల రూపాయల వరకు వేతనం లభించనుంది. ఎన్‌సీఆర్‌టీసీ నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలుస్తోంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం కలగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుందని తెలుస్తోంది.