సిద్ధార్థ్ ఒక భారతీయ నటుడు. ఈయన ప్రధానంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటించాడు. ఈయన నటనతో పాటు స్క్రీన్ రైటర్, నిర్మాత, నేపథ్య గాయకుడిగా కూడా కొన్ని చిత్రాలలో పాలుపంచుకోవడం జరిగింది. 2003లో ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోయాడు. ఈయన కెరీర్లో ది బెస్ట్ తెలుగు చిత్రాలుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలు ప్రధానమైనవి. ఆ తర్వాత కొంతకాలం బ్రేక్ ఇవ్వగా.. 2021 లో ఈయన మహాసముద్రం సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా విడుదల సమయంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ పాల్గొనడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూలో తనను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీ వయసు అంతగా కనపడదు దీనికి గల కారణం ఏంటని ప్రశ్న అడగడం జరిగింది. అందుకు బదులుగా తాను రోజుకు 8 నుంచి 10 గంటలు కచ్చితంగా నిద్రపోతానని తెలిపాడు. స్కిప్ చేయకుండా సమయానికి భోజనం కంపల్సరీ తీసుకుంటానని చెప్పాడు.
ఎన్ని సమస్యలు వచ్చినా పెద్దగా టెన్షన్ పడనని తెలుపుతూ, ఎక్కువగా టెన్షన్ పడితే ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. వయసు కూడా తొందరగా పెరిగినట్లుగా కనిపిస్తుంది. అందుకే జీవితంలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది.
తన తండ్రి తనను తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరో చేశారని, అది నిలుపుకునేలా మంచి కథలతో పలు చిత్రాల్లో నటించాలని చెప్పారని తెలిపాడు. మంచి కథ, మంచి డైరెక్టర్ సెట్ అయితే తెలుగులో తన గుర్తింపును నిలుపుకుంటానని చెప్పడం జరిగింది. ఇక సిద్ధార్థ్ తమిళంలో పోన్నియిన్ సెల్వన్: ఐ సినిమాలో నటించడం జరిగింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.