ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్ అయిన హీరో, హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ లివింగ్ రిలేషన్ అనేది కామన్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అయితే ఈ కల్చర్ చాలా విస్తృతంగా ఉంటుంది. సౌత్ లోకి వచ్చేసరికి తక్కువగానే ఉంటుంది. కొంత మంది సెలబ్రిటీలు రిలేషన్ షిప్ లో ఉన్నా కూడా ఆ విషయాన్ని తమకు తాముగా బయటపెట్టే వరకు ఎవరికి తెలియదు. అయితే కొంత మంది మాత్రం చాలా వేగంగా ఓపెన్ అయిపోతారు.

నేరుగా రిలేషన్ లో ఉన్నట్లు ఒప్పుకోకపోయిన రెగ్యులర్ గా కలిసి తిరుగుతూ, కలిసి కెమెరాలకి చిక్కుతూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు వారి వ్యక్తిగత ఫోటోలని షేర్ చేసుకున్నప్పుడు కలిసి ఉన్నవి కూడా పంచుకుంటూ ఉంటారు. అలా ఇప్పుడు సౌత్ లో హాట్ ఫెయిర్ గా ఉన్న జంట సిద్దార్ద్, అదితీరావ్ హైదరీ. వీరిద్దరూ కలిసి తెలుగులో మహా సముద్రం సినిమాలో కలిసి నటించారు.

అక్కడే ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ గా ఇద్దరు మీడియా కంటికి చిక్కుతున్నారు. ఇద్దరు వెకేషన్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉండటం విశేషం. ఇక వీరికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కలిసి షార్ట్ వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.

ఇలా ఫోటోలు, వీడియోలతో అదితీరావ్, సిద్దార్ద్ రిలేషన్ లో ఉన్నారనే విషయం కన్ఫర్మ్ అయిపొయింది. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ధృవీకరించడం లేదు. తాజాగా మరోసారి ఇద్దరు జంటగా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. అయితే మీడియా కెమెరాలు కనిపించగానే సిద్దార్ద్ ఆగకుండా చెకింగ్ పాయింట్ దగ్గరకి వెళ్ళిపోయాడు.

అయితే అదితీరావ్ మాత్రం ఫోటోలకి ఫోజులు ఇచ్చి మెల్లగా నడుచుకొని వెళ్ళింది. ప్రస్తుతం సిద్దార్ద్ నటించిన టక్కర్ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో సిద్దార్ద్ ఉన్నారు. వీటికి అదితీరావ్ కూడా అతనితో పాటు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.