ఆ హీరోయిన్ వల్లే దిల్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడా.. ఇంతకు అసలు విషయం ఏంటంటే?

Dil Raju importing Tamil heros to Telugu market

దిల్ రాజు ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత ఇంకా పంపిణీదారుడు. తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. ఇతని అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి. వృత్తిరీత్యా దిల్ రాజుగా పిలువబడుతున్నాడు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నాడు.

2003లో దిల్ సినిమాను నిర్మించి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. తర్వాత వరుసగా ఎన్నో విజయవంత సినిమాలను నిర్మించి తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతలలో ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందాడు. ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో నెగటివ్ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అసలు విషయం ఏంటంటే ఈయన మొదటి భార్య చనిపోవడంతో రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ రెండవ వివాహం ఒక హీరోయిన్ ని చేసుకోవాలి అనుకొని కాస్త పరిచయం కూడా బాగా పెంచుకున్నాడట. చివరికి ఆ హీరోయిన్ పెళ్లి ఇష్టం లేదు అనడంతో ఇక చేసేదేమీ లేక తన కూతురు సెలెక్ట్ చేసిన తేజస్విని వివాహం చేసుకున్నాడు.

వీరికి ఒక బాబు సంతానం. అంతా బాగానే ఉంది కానీ.. ఇతనిని రిజెక్ట్ చేసిన హీరోయిన్ తరువాత సినిమాలలో కనుమరుగైపోయింది. దీనికి కారణం దిల్ రాజు అయ్యుండొచ్చని సోషల్ మీడియా వేదికగా నెగటివ్ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం దిల్ రాజు రెండవ భార్యతో సంతోషంగానే ఉన్నాడట.

ప్రస్తుతం దిల్ రాజు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ సి 15 సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకు సినిమా థియేటర్ రిలీజ్ ఎప్పుడు చేయాలి.. ఓటీటీ లో రిలీజ్ ఎప్పుడు చేయాలి. అనే విషయాలలో బాగా ప్రసిద్ధి చెందాడు. దిల్ రాజు అంటే గిట్టని వాళ్లు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.