కొడుకు పై ట్రోల్స్ చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బుల్లితెర నటుడు ప్రభాకర్!

ప్రభాకర్ బుల్లితెర నటుడు. దూరదర్శన్ ఉన్నప్పటినుండి బుల్లితెర లో నటించడం ద్వారా ఈయనను బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తారు. ఈటీవీ ప్రభాకర్ అని పిలిచేవారు కూడా ఉన్నారు. ప్రభాకర్ తన ఫ్రెండ్ ఒక షూటింగ్లో నటిస్తూ ఉండగా అక్కడికి వెళ్ళిన ప్రభాకర్ ను చూసి డైరెక్టర్ చాణక్య సీరియల్లో అవకాశం ఇచ్చాడు.

ఆ తరువాత ఋతురత్నాలు సీరియల్ లో నటించడం ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఎంతోకాలం ఈటీవీలో మేనేజ్మెంట్ పలు బాధ్యతలు నిర్వహించాడు. ఇతను స్వయంగా కొన్ని సీరియల్ లను కూడా నిర్మించడం జరిగింది. సినిమాలలో కూడా పలు సహాయక పాత్రలలో నటించి మెప్పించాడు.

సినిమాలలో కంటే సీరియల్ లోనే రాణిస్తూ బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. కొన్ని షోలకు యాంకర్ గా కూడా చేయడం జరిగింది. ప్రభాకర్ తన కుమారుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేశాడు. చంద్రహాస్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఎంట్రీ ప్రకటించాడు ప్రభాకర్.

ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచి నెటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వారు ట్రోల్స్ చేస్తున్నారు. కొందరైతే కొత్త వాళ్లే ఇండస్ట్రీకి వచ్చి హీరోగా సెటిల్ అవుతున్నారు. ఒక నటుడి కొడుకు హీరో అయితే తప్పేముంది అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే సినిమాలో ఎంట్రీ కాకముందే స్పీచ్ ద్వారా ఓవరాక్షన్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నటుడు ప్రభాకర్ ఈ ట్రోల్స్ లో ఆపండి చంద్రహాస్ హీరో కావడంలో తప్పేముంది అంటూ పేర్కొనడం జరిగిందని వార్తలు కూడా సోషల్ మీడియాలో చేరాయి. మొత్తానికి ప్రభాకర్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి, దీనికి సంబంధించిన గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి.