రెండో పెళ్లి వార్తలపై స్పందించి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నటి మీనా.. కొంచెమైనా బుద్ధుందా అంటూ ఫైర్?

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదా గత కొద్ది రోజులుగా ఈమె గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతుంది. ఈమె భర్త విద్యాసాగర్ మరణించడంతో ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడిన మీనా రెండో పెళ్లికి సిద్ధమైందని ఈమె తన స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి.

అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మీనా స్పందించాల్సి ఉండగా తాజాగా ఈమె ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా మీనా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొంచమైనా బుద్ధుందా డబ్బు కోసం ఏమైనా చేస్తారా… ఏమైనా రాస్తారా. మీకు ఎవరు చెప్పారు నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని.సోషల్ మీడియా రోజురోజుకు దిగజారి పోతుందని ఏవి నిజమో ఏవి అబద్ధమో తెలుసుకొని వార్తలు రాయండి అంటూ ఈమె సీరియస్ అయ్యారు.

ఇకపోతే తన భర్త మరణించిన సమయంలో కూడా ఇలాంటి తప్పుడు కథనాలు రాశారు. ఇప్పటికీ ఇంకా మీ ధోరణి మార్చుకోలేదు ఇలాగే కొనసాగితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈమె వార్నింగ్ ఇచ్చారు. ఇలా రెండో పెళ్లి గురించి స్పందించి మీనా ఫుల్ సీరియస్ అవుతూ వార్నింగ్ ఇవ్వడంతో ఈమె రెండో పెళ్లి గురించి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమేనని చెప్పడమే కాకుండా తన రెండో పెళ్లి వార్తలకు పులిస్టాప్ పెట్టారు. ప్రస్తుతం మీనా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.